- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసు కుటుంబాలతో సీపీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్
దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసు కుటుంబ సభ్యులు సమాజహితం కోసం మరింత విశ్వాసంతో, నిర్మాణాత్మకంగా ఆలోచించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 500 మంది పోలీసు కుటుంబ సభ్యులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మానసికంగా బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా పోలీసుల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప్పు నీరు, గోరు వెచ్చని తాగడం, తాజా ఆహారాన్ని తీసుకోవడం, విటమిన్ టాబ్లెట్లు తీసుకోవాలని సూచించారు. ఏమైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలను అనుసరించాలని సీపీ తెలిపారు.