- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బోధన్ పాస్‌పోర్టుల కేసు.. నిందితుల అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బోధన్ నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారాంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మంగళవారం 16 మంది సభ్యులతో విచారణ జరిపిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. అంతేగాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందిన పరిమళ్‌బైన్‌గా గుర్తించారు. ఒకే అడ్రస్‌పై 32 పాస్‌పోర్టులు జారీ అయినట్టు గుర్తించారు. కాగా, నిందితులు మొత్తం 72 పాస్‌పోర్టులతో పాటు ఆధార్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అక్రమ పాస్‌పోర్ట్‌లు, వీసాలతో 19 మంది విదేశాలకు వెళ్లారని వెల్లడించారు. మరో 66 మంది పాస్‌పోర్టు చిరునామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేయగా, వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. గత నెల 25న భారత పాస్‌పోర్టులతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.