- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భయమొద్దు.. జాగ్రత్తగా ఉంటే చాలు : సీపీ అంజనీకుమార్
దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా వైరస్‌కు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, కేవలం జాగ్రత్తలు పాటిస్తే చాలని నగర సీపీ అంజనీకుమార్ సూచించారు. నగర పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధి ఆసిఫ్ నగర్ డివిజన్‌లో కరోనాను జయించిన 42మంది పోలీసు అధికారులను తిరిగి విధుల్లో చేరుతున్నందున వారికి సీపీ ఘనంగా స్వాగతం పలికారు. గుడి మల్కాపూర్ కింగ్స్ ఏఎం గార్డెన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ వారిని అభినందించి, సర్టిఫికెట్, బహుమతిని ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను జయించి, విధుల్లోకి చేరుతున్న పోలీసు అధికారులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఒకవేళ కరోనా బారిన పడిన వారు భయం, బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, చేతులను గంటకోసారి సబ్బుతో శుభ్రం చేసుకోవడం, వేడి నీరు తాగడం లాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండి పోలీసులకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్భాల్ సిద్దిఖీ, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ కరుణాకర్, ఆసిఫ్ నగర్ ఏసీపీ శివమారుతి, గోషామహాల్ ఏసీపీ వీవీఎస్ రామలింగరాజు పాల్గొన్నారు.