- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరిగిన సైబర్ నేరాలు… ఎన్ని కేసులంటే !
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో సాధారణ నేరాలు గతేడాదితో పోలిస్తే 10శాతం తగ్గి, సైబర్ నేరాలు 500 కేసులు పెరిగినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. బుధవారం సీపీ విలేకరులతో మాట్లాడుతూ సిటీలో గతేడాది 2019 జనవరి నుంచి జూన్ నేరాలతో ఈ ఏడాది (2020) ఆరునెలల నేరాలపై సమీక్ష నిర్వహించినట్టు పేర్కొన్నారు. 2019 జనవరి నుంచి జూన్ వరకూ 12,374 కేసులు వస్తే ఈ ఏడాది 12,273 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులు గతేడాదితో పోల్చితే 10 శాతం తగ్గాయన్నారు. వీటిలో నార్త్‌జోన్‌లో 240, సీసీఎస్‌లో 500 కేసులు పెరగ్గా, సెంట్రల్ జోన్‌లో 386, ఈస్ట్‌జోన్ 83, వెస్ట్‌జోన్‌లో 86 కేసులు తగ్గాయన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ కొత్తగా 145మందిపై రౌడీషీట్ కేసులు బుక్ చేసినట్టు తెలిపారు. పెద్ద పెద్ద చోరీల్లో 2019లో 53శాతం, 2020లో 56 శాతం కేసులను కనుగొన్నామన్నారు. సీరియస్ దొంగతనాల కేసుల్లో 2019లో 64 శాతం ఛేదించగా, 2020లో 74శాతం కేసులను పట్టుకున్నామన్నారు. డెకాయిట్ కేసులు గతేడాది 9, ఈ ఏడాది 3 కేసులు జరిగినట్టు చెప్పారు. పగటిపూట ఇంటి దొంగతనాలు 2019లో 38 కాగా, 2020లో 21 జరిగాయని, రాత్రిపూట ఇంటి దొంగతనం కేసులు 2019లో 136 కాగా, 2020లో 133 చోటు చేసుకున్నాయన్నారు.