- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
200 మంది నేరస్థులపై చార్జీషీట్స్
దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 200 మంది నేరస్థులపై చార్జీషీట్స్ దాఖలు చేసినట్టు నగర సీపీ అంజనీకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో హైదరాబాద్ పోలీసుల పనితీరు మెరుగ్గా ఉందని ఆయన వివరించారు. గురువారం నాటికి సుమారు 200 మంది నొటోరియస్ క్రిమినల్స్‌పై న్యాయ స్థానాల్లో చార్జీషీట్లు దాఖలు చేసినట్టు అంజనీకుమార్ చెప్పారు. శుక్రవారం ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇదిలా ఉండగా, కరోనా మహమ్మారిపై తాము నిత్యం పోరాడుతున్న సమయంలో పోలీసు అధికారుల మనో ధైర్యం దెబ్బతినేలా నిరుత్సాహా పూరిత కథనాలు, ప్రసారాలను పత్రికలు, మీడియా సంస్థలు చేస్తున్నాయని సీపీ అసహనం వ్యక్తంచేశారు.కరోనా నేపథ్యంలో పోలీసులకు వైద్య పరీక్షలు జరిపించి, ముందస్తుగా అన్నిజాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోలీసు శాఖలోని సిబ్బందిని సెలవులపై వెళ్లమని ఎవరూ అడగరని సీపీ స్పష్టంచేశారు.