ఓకే ఓకే.. అరవొద్దు.. వెళ్లిపోతాగా..

by Shamantha N |   ( Updated:2020-07-18 00:54:03.0  )
ఓకే ఓకే.. అరవొద్దు.. వెళ్లిపోతాగా..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భలే బాగుందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. విషయమేమిటంటే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో ఓ ఆవు అటూ ఇటూ తిరుగుతూ డూమాడ్జీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లింది. దీంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు ఆవును చూసి అరిచారు. దీంతో ఆ ఆవు మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. కానీ, ఆ ఆవు ఎలాంటి నష్టమూ చేయలేదు. ఈ వీడియోను ఆ స్టేషన్ పోలీసులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరలవుతోంది. సరదాగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

Next Story