- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వ్యాక్సిన్ వేసుకుంటే డెల్టా వేరియంట్ ఖతం
న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు రెండు డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్లలో డెల్టా వేరియంట్‌ను పూర్తిగా ఎదుర్కోగల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్), ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇనిస్టిట్యూట్’(ఎన్ఐవీ) చేపట్టిన రీసెర్చ్‌లో వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తికి రెండు డోసుల కొవిషీల్డ్ డోసులు ఇవ్వగా, సదరు వ్యక్తిలో ‘డెల్టా’, కప్పా వేరియంట్‌లను ఎదుర్కోగల యాంటీ బాడీలు అభివృద్ధి చెందినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఐసీఎంఆర్, ఎన్ఐవీ వెల్లడించిన వివరాల ప్రకారం, అధ్యయనంలో భాగంగా కేటగిరీల వారీగా ఐదు బృందాలపై ప్రయోగాలు జరిపారు.
ఈ బృందంలో 1. సింగిల్ డోసు తీసుకున్నవారు 2. రెండు డోసులు తీసుకున్నవారు 3. కోలుకుని సింగిల్ డోసు తీసుకున్నవారు 4. కోలుకుని రెండు డోసులు తీసుకున్నవారు 5. డెల్టా వేరియంట్ రోగులు ఉన్నారు. వ్యాక్సినేషన్ అయిన నాలుగు వారాల తర్వాత మొదటి నాలుగు గ్రూపులవారి నుంచి ‘సీరం’ (సెరా-రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే పలుచని ద్రవపదార్థం) సేకరించారు. అలాగే, రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన రెండు వారాలకు ఐదో గ్రూపు వారి నుంచీ సీరం సేకరించారు. వీటిని పరీక్షించిన అనంతరం వైరస్ నుంచి కోలుకుని రెండు డోసుల కొవిషీల్డ్ తీసుకున్నవారితోపాటు డెల్టా సోకిన అనంతరం రెండు డోసుల కొవిషీల్డ్ తీసుకున్నవారిలో కొత్త వేరియంట్‌లను ఎదుర్కోగల యాంటీ బాడీలను గుర్తించారు. వీరితో పోల్చితే మొదటి రెండు గ్రూపుల్లో ఈ తరహా యాంటీ బాడీలు తక్కువగా కనిపించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.