గాంధీ ఆస్పత్రిలో ఏమాత్రం తగ్గని కొవిడ్ పేషెంట్లు

by vinod kumar |
gandhi-hospital
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. సెకండ్ వేవ్ దాదాపుగా ముగిసింది అనుకుంటున్న తరుణంలో గాంధీ ఆసుపత్రిలో నమోదు అవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తిగా తగ్గిపోతాయి అనుకున్న కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. వైద్యశాఖ రోజు వారిగా విడుదల చేస్తున్న షెడ్యూల్‌లో కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ గాంధీ ఆసుపత్రికి పేషేంట్లు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతవారం రోజుల నుంచి 500 మందికి తగ్గకుండా కరోనా పేషేంట్లు గాంధీలో చికిత్సలు పొందుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 642 మంది పేషేంట్లు చికిత్సలు పొందుతుండగా వీరిలో 492 కరోనా కేసులు, 150 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి.

రోజుకు దాదాపుగా 60 మంది వరకు పేషేంట్లు డిశ్చార్జ్ అవుతుండగా 80 మంది వరకు కొత్త పేషేంట్లు అడ్మిట్ అవుతున్నారు. గాంధీలో 650 జనరల్, 631 ఆక్సిజన్, 619 ఐసీయూ మొత్తం 1869 బెడ్లు ఉండగా వీటిలో 642 మంది చికిత్సలు పొందుతున్నారు. వీరిలో జనరల్ బెడ్లలో 19 మంది, 105 మంది ఆక్సిజన్ బెడ్లలో, చికిత్సలు పొందుతుండగా అత్యధికంగా 518 మంది పేషేంట్లు ఐసీయూ బెడ్లలో చికిత్సలు పొందుతున్నారు. కోవిడ్ పేషేంట్లు ఏమాత్రం తగ్గకుండా గాంధీ ఆసుపత్రికి చికిత్సల కోసం వస్తుండటంతో ఆందోళన మొదలవుతుంది.

Advertisement

Next Story

Most Viewed