కొవిడ్ పేషెంట్లలో అరుదైన సిండ్రోమ్

by sudharani |
కొవిడ్ పేషెంట్లలో అరుదైన సిండ్రోమ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా మానవ శరీర వ్యాధి నిరోధక శక్తి కుంటుపడటంతో అరుదైన జబ్బులు కూడా శరీరాన్ని ఎటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా గిలియన్ బార్రే సిండ్రోమ్ అనే వ్యాధి కొవిడ్ పేషెంట్లలో కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. గత ఆగస్టు నుంచి భారతదేశంలోని కరోనా పేషెంట్లలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం ముంబైకి చెందిన న్యూరాలిజిస్టుల బృందం ఈ సిండ్రోమ్ సోకిన పేషెంట్ల లక్షణాలను అధ్యయనం చేస్తోంది. ఇంతకీ ఈ గిలియన్ బార్రే సిండ్రోమ్ అంటే ఏమిటి?

వ్యాధినిరోధక శక్తిని ప్రభావితం చేసే అరుదైన జబ్బుల్లో ఇది ఒకటి. కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా వ్యాధినిరోధక వ్యవస్థ బాహ్య నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. అలా దాడి చేయడం వల్ల కాళ్లు, చేతులలోని నాడులు దెబ్బతింటాయి. మొదట చర్మం మీద దురదతో మొదలై నెమ్మదిగా కండరాల బలహీనత, నొప్పి, మొద్దుబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా ఇవి పాదాలు, అరచేతుల్లో కనిపిస్తాయి. ఈ స్థితి నెమ్మదిగా పక్షవాతానికి దారితీస్తుంది. కొవిడ్ వస్తే నరాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story