- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా కార్యకర్తలకు కరోనా సోకదు.. బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కులం, మతం, ప్రాంతం వంటి తరతమ బేధాలు లేకుండా అందరితో సమన్యాయం పాటిస్తూ.. నిర్లక్ష్యంగా ఉన్నవారిపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్ బీజేపీ కార్యకర్తలను ఏం చేయలేదట..! ఈ మాట అంటున్నది ఎవరో కాదు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే. గుజరాత్‌కు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్‌కోట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పాటిల్ ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఎవరైతే పని చేస్తారో వాళ్లు శ్రామికులు చేసే పని చేయండి. అప్పుడే కరోనా వైరస్‌కు దూరంగా ఉంటారు. బీజేపీ కార్యకర్తలు చాలా శ్రమిస్తారు. అందుకే వారికి కరోనా వైరస్ సోకదు..’ అని వ్యాఖ్యానించారు.
కాగా.. కొద్దిరోజుల క్రితమే గోవింద్ పటేల్ సైతం కరోనా బారిన పడటం గమనార్హం. కానీ ఆయన దానినుంచి త్వరగానే కోలుకున్నారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కారణం కాదా..? ఆ బాధ్యత ప్రభుత్వానిదేగా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. దీనికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్యానించారు. రోడ్ల మీద ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకోవడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని, ఎక్కడ పడితే అక్కడ గుమిగూడటంతోనే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందని పటేల్ ఆరోపించారు.