- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్రలో మహమ్మారి వీర విజృంభణ.. 3 నెలలలో తొలిసారిగా..
దిశ, వెబ్‌డెస్క్: తగ్గిందనుకున్న గాయం తిరగదోడుతున్నది. సుమారు ఏడాదిన్నర పాటు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాయదారి మహమ్మారి కరోనా వైరస్ రెండో దశ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో తొలి దశలో మాదిరిగానే పంజా విసురుతున్నది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) అక్కడ 16,620 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో కొవిడ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 23,14,413కు చేరింది.
ముంబయిలో అత్యధికంగా 1,963 కేసులు రాగా.. పూణెలో 1,780.. ఔరంగాబాద్‌లో 752, నాందేడ్‌లో 351 కేసులు నమోదయ్యాయి. ఇక కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాగ్‌పూర్‌లో 1,976 పాజిటివ్ కేసులు వచ్చాయి.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం నాటికి) 26,291 కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 118 మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పటికే పలు ప్రాంతాలలో కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తుండగా.. మధ్యప్రదేశ్, పంజాబ్, కర్నాటకలలో కూడా రాత్రి పూట కర్ఫ్యూలు అమల్లోకి వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నా.. ప్రజలు మాత్రం వాటిని ఖాతరు చేయడం లేదు.