- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం
దిశ, వెబ్డెస్క్:
ఏపీలో పున:ప్రారంభమైన స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 829 మంది టీచర్లు, 575 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో 70,790 మంది టీచర్లకు, 95,763 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో 141 మంది టీచర్లు, విశాఖలో 50 మంది టీచర్లకు పాజిటివ్ తేలింది. విజయనగరంలో ఇద్దరు విద్యార్థులు, ఆరుగురు టీచర్లు కరోనా బారిన పడ్డారు. ఇక తూర్పు గోదావరిలో 139 టీచర్లు, ఒక విద్యార్థికి.. ప్రకాశంలో నలుగురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరిలో అత్యధికంగా 262 మంది విద్యార్థులు, 172 టీచర్లు.. గంటూరులో 141 మంది విద్యార్థులు, 72 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారు.
నెల్లూరులో 27 మంది విద్యార్థులు, 38 మంది టీచర్లు.. కర్నూలులో 119 మంది స్టూడెంట్స్, 72 మంది టీచర్లు.. కడపలో 63 మంది టీచర్లు, ఒక విద్యార్థికి కరోనా సోకింది. చిత్తూరులో 63 మంది టీచర్లకు.. అనంతపురం జిల్లాలో 18 మంది విద్యార్థులు, 51 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.