- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎత్తైన ప్రదేశాల్లో కొవిడ్ 19 భయం తక్కువేనట!
సముద్ర మట్టం నుంచి ఎత్తులో ఉన్న ప్రదేశాల్లో కొవిడ్ 19 వ్యాప్తి భయం తక్కువేనని ఓ అధ్యయనంలో తేలింది. ఆ ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ సోకే అవకాశాలు తక్కువని తెలిసింది. రెస్పిరేటరీ ఫిజియాలజీ, న్యూరోబయోలజీ జర్నల్‌లో దీని గురించి ఒక వ్యాసం ప్రచురితమైంది. సముద్రమట్టం నుంచి 3000 మీటర్ల కంటే ఎత్తులో ఉన్న ప్రదేశాల్లో మిగిలిన ప్రాంతాలతో పోల్చినపుడు కరోనా కేసులు తక్కువ నమోదయ్యాయని ఈ వ్యాసంలో పేర్కొన్నారు.
బొలీవియా, ఈక్వెడార్, టిబెట్‌లోని వివిధ ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో తక్కువ ఎత్తులో ఉన్న చైనాతో పోల్చితే టిబెట్‌లో కరోనా కేసులు చాలా తక్కువ నమోదయ్యాయి. ఇంకా బొలీవియాతో పోల్చితే మూడు రెట్లు తక్కువగా, ఈక్వెడార్‌లో పోలిస్తే నాలుగు రెట్లు తక్కువ నమోదయ్యాయి.
కారణం ఏంటి?
కేసుల వ్యాప్తిని పరిశీలించిన తర్వాత ఇలా ఎక్కువ ఎత్తులో తక్కువ కేసులు నమోదవడానికి కారణం కొవిడ్ 19 సోరోషే అని స్పష్టం చేశారు. సోరోషే అంటే క్వెచువా భాషలో ‘ఆల్టిట్యూట్ సిక్‌నెస్’ అని అర్థం. అంటే ఎత్తు పెరిగే కొద్దీ కొవిడ్ 19 ప్రభావం తక్కువవుతుందని నిరూపితమైంది. అంతేకాకుండా ఎత్తైన ప్రాంతాల్లో నివసించే వారికి హైపోక్సియాను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే రక్తంలో తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉన్నప్పటికీ వారు నిలకడగానే ఉండగలుగుతారు. అలాగే ఆ ప్రాంతాల్లో వీచే పొడి గాలి, అధిక మొత్తంలో ఉండే అతినీలతోహిత రేడియేషన్ వల్ల కొవిడ్ వైరస్ జీవించలేకపోతోందని వ్యాసంలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా అధిక ఎత్తున్న ప్రదేశాల్లో నివసించే వారి నుంచి కొవిడ్ 19కు చికిత్స చేయడం లేదా మందు కనిపెట్టడంలో సాయంగా ఉంటుందని తెలిపారు.