- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మ్యాప్ మై ఇండియాలో.. కరోనా ఆస్పత్రుల వివరాలు
దిశ వెబ్ డెస్క్ :
కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూపోతుంది. కరోనా లక్షణాలు లేకున్నా కూడా కొందరిలో కరోనా పాజిటివ్ వస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా.. వాళ్ల వల్ల ఇతరులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. అందువల్ల కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించినా కరోనా టెస్ట్ చేయించుకోవడం ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మనం ఉంటున్న ప్రాంతానికి దగ్గర్లో కరోనా టెస్టింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, అడ్రస్ ఏంటీ తదితర వివరాలతో పాటు కరోనా అప్ డేట్స్ ను అందిస్తోంది ‘మ్యాప్ మై ఇండియా’.
కరోనా వచ్చిందని తెలుసుకోవాలంటే.. ముందుగా మనం టెస్ట్ చేయించుకోవాలి. మరి మన దగ్గర్లో కరోనా టెస్ట్ చేసే ల్యాబ్ లు ఏమున్నాయి, లేదా ఏ ఆస్పత్రిలో టెస్ట్ లు చేస్తున్నారో తెలియాలి. అంతేకాదు ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తున్నారు, ఐసోలేషన్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి వంటి వివరాలు తెలియాలి. ఆ విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను మ్యాప్ మై ఇండియా యాప్ అందిస్తోంది. మన దేశంలోని యూజర్లకు. ఆ యాప్ ద్వారా దగ్గర్లోని కరోనా టెస్టింగ్ సెంటర్ల వివరాలు, అడ్రస్ తెలుసుకునే సదుపాయంతో పాటు, లొకేషన్ నేవిగేట్ చేసుకునే సదుపాయం కూడా ఇచ్చింది. అంతకుముందు కరోనా బారినపడి కోలుకున్న వారి రివ్యూలు, ఆయా సెంటర్లలో ఫుడ్ ఎలా ఉంటుంది, డాక్టర్లు ఎలా ఉంటారు తదితర వివరాలను కూడా పొందుపర్చారు. మాస్క్, బెడ్స్, పీపీఈలు, వెంటిలేటర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. మన ఏరియాలో ఎన్ని కేసులు నమోదయ్యాయో కూడు అందులో చూసుకోవచ్చు. అంతే కాకుండా ఆ యాప్‌ను మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్‌సైట్‌కు కూడా లింక్ చేశారు. దీంతో పూర్తి కేసుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం యాప్‌లో ప్రత్యేకంగా ‘కరోనా’ అనే బటన్‌ను ప్రవేశపెట్టింది. లాక్‌డౌన్ వేళ టెస్టింగ్ సెంటర్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ సదుపాయం తీసుకొచ్చారు.
Tags: coronavirus, lockdown, positive cases, information, hospitals, isolation centres