- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాత్కాలికంగా యమహా తయారీ ప్లాంట్ల మూసివేత
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ ఇండియా యమహా మోటార్(ఐవైఎం) దేశవ్యాప్తంగా తన రెండు ప్లాంట్లను మే 15వ తేదీ నుంచి 31 వరకూ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర సమీక్ష అనంతరం తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో ఉన్న కర్మాగారాల్లో తయారీ కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయించిన కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మద్దతుగా, దేశంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని, ముఖ్యంగా సంస్థలోని ఉద్యోగుల ఆరోగ్య, భద్రతను పరిగణలోకి తీసుకుని మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నామని కంపెనీ వివరించింది.
ఈ అంతరాయాన్ని వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించేందుకు, స్టాక్ వృద్ధిపై దృష్టి పెట్టడానికి కంపెనీ డీలర్లు, సరఫరాదారులతో సంప్రదింపులు జరుపుతామని కంపెనీ తెలిపింది. కార్పొరేట్ ఆఫీసులు, స్థానిక కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు వినియోగదారులకు, వ్యాపార భాగస్వాములతో సాధ్యమైనత వరకు సహాయాన్ని అందించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తారని కంపెనీ పేర్కొంది.