ఫస్ట్ టైం కొనుగోలు చేసే వారు పెరిగారు : మారుతీ సుజుకి

by Harish |
ఫస్ట్ టైం కొనుగోలు చేసే వారు పెరిగారు : మారుతీ సుజుకి
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా కొనసాగుతున్నప్పటికీ మొదటిసారి వాహనాలను కొనుగోలు చేసేవారు, అదనంగా కార్లను కొనే వారి శాతం పెరిగిందని, ప్రజా రవాణా కంటే వ్యక్తిగత ప్రయాణానికి వినియోగదారులు ఇష్టపడుతున్నారని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ అధికారు ఒకరు తెలిపారు. జులైలో వాహనాల అమ్మకాలు మెరుగుపడినా, రాబోయే పండుగ సీజన్‌లో కొనుగోలు విధానం ఎలా ఉండబోతోందనే దాన్ని బట్టి దీర్ఘకాలం పాటు వాహనాల డిమాండ్ ఆధారపడి ఉందని కంపెనీ వెల్లడించింది.

ఫస్ట్-టైం బయర్ల కొనుగోలు పెరిగింది. రీప్లేస్ చేసుకునే కొనుగోలు శాతం తగ్గింది. అంటే, మార్పిడి తగ్గింది. అలాగే, అదనంగా కార్లను కొనుగోలు చేసే వారి శాతం కూడా పెరిగింది. ఇది ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

ప్రజలు ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో ఆదాయ స్థాయిలో మార్పులతో ఇది కొంత తక్కువే నమోదవుతోంది. ఈ పరిస్థితులపై స్పష్టత కోసం కొన్నాళ్లు వేచి ఉండాలని శశాంక్ వివరించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫస్ట్ టైం కొనుగోలుదారుల వాటా 5.5 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed