- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యాపేటలో కేసులు తగ్గుముఖం
దిశ, నల్లగొండ: సూర్యాపేట పట్టణాన్ని కరోనా వైరస్ అట్టుడికించింది. ఒక్క పాజిటివ్ కేసుతో మొదలై.. రోజుల వ్యవధిలోనే 83 కేసులుగా మారి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. దీంతో అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఉలిక్కిపడింది. అసలు సూర్యాపేట పట్టణంలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టలేదు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా పట్టణంలో పర్యటించింది. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒక్క సూర్యాపేట పట్టణంలోనే 54 కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యాపేట పట్టణాన్ని అధికారులు అష్ట దిగ్బంధనం చేశారు. ఈ క్రమంలో కేసులు తగ్గుముఖం పట్టాయి.
లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టం..
సూర్యాపేట పట్టణంలోని అన్ని ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. దీంతో గత నాలుగు రోజులుగా కేసులు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. అయినా అలసత్వం ప్రదర్శించుకుండా పట్టణంలో లాక్‌డౌన్‌ను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగానే కంటైన్మెంట్, రెడ్జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. పాజిటివ్ కేసులు బయటపడ్డ వార్డుల్లో 200 మీటర్ల పరిధి వరకు గల ప్రాంతాన్ని పూర్తిగా కట్టడి చేశారు. పట్టణాన్ని ఎనిమిది క్లస్టర్లుగా చేసి నిత్యావసరాలను తీర్చాలని నిర్ణయించారు. హైఅలర్ట్ కొనసాగుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధికారులు కొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. హోల్‌సేల్ దుకాణాల ద్వారా అన్ని ప్రాంతాలకు సరకుల్ని సరఫరా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సంచార బజార్లు.. హోల్‌సెల్ దుకాణాలు..
సూర్యాపేట పురపాలికలో సంచార బజార్ల ద్వారా అమ్మకాలు చేపట్టాలని తీర్మానించారు. హోల్‌సేల్ దుకాణాల కోసం ఎస్వీ డిగ్రీ కాలేజీతోపాటు కిరాణ వర్తక సంఘం ఫంక్షన్ హాలు అనువైనదిగా భావించారు. వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఔషధాలు అవసరమైన వారికి ఇంటింటికీ సరఫరా చేసేందుకు వీలుగా 22 దుకాణాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కమిటీని నియమించారు. డీఎస్పీ, పురపాలిక కమిషనర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, పురపాలిక ప్రత్యేకాధికారితో కూడిన బృందం కార్యకలాపాలు పర్యవేక్షించనుంది. కట్టుదిట్టమైన ఈ చర్యల వల్ల సూర్యాపేటలో ఈనెల 19 నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. సూర్యాపేటకు అనుబంధంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టుల ద్వారా రాకపోకలు లేకుండా చూస్తున్నారు.
Tags: covid 19, positive, cases, increased, lock down, tightened, suryapet, district, minister