కేసుల విచారణ ఎప్పటి నుంచో తెలుసా….

దిశ వెబ్ డెస్క్: న్యాయ సేవల పునరుద్దరణకు హైకోర్టు నిర్ణయించింది. ఆరు నెలల విరామం అనంతరం తిరిగి హైకోర్టు భవనంలో కేసుల విచారణ కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడప్పుడే కరోనా తగ్గే పరిస్థితులు కనిపించకపోవడంతో హైకోర్టు ఈ నిర్ణయానికి వచ్చింది. కాగా ఈ నెల7 నుంచి న్యాయ సేవలను పాక్షికంగా ప్రారంభించాలని నిర్ణయించింది. మొత్తం ఐదు బెంచ్ లు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 21 వరకు మిగతా బెంచ్ లు ఆన్లైన్ లోనే విచారణ జరుపుతాయని ఉత్తర్వుల్లో తెలిపింది.

కాగా ప్రయోగత్మకంగా కరీనగర్ జిల్లాలో కోర్టులు పనిచేస్తాయని తెలిపింది. ఈనెల7 నుంచి 11వరకు సేవలు అందించనున్నాయని తెలిపింది. 21 తర్వాత మిగతా జిల్లాల్లో కోర్టుల్లో కేసుల విచారణ మొదలవుతుందని తెలిపింది.

Advertisement