- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకంగా సింహంతోనే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. చివరకు ఏమైందో తెలుసా..!
దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్స్‌కు ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడని కొత్త జంటలు క్రియేటివ్ ఫొటోషూట్స్ పేరిట వియర్డ్ థింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రుతిమించిన రొమాంటిక్ యాంగిల్స్‌లో ఫొటోలకు ఫోజులిస్తూ పాపులర్ అవుతున్నారు. అయితే తాజాగా పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఓ జంట భయంకరమైన ఫొటో షూట్‌తో అవాక్కయ్యేలా చేసింది. షూట్‌లో భాగంగా సింహాన్ని ప్రాపర్టీగా యూజ్ చేసి పలువురిని భయపెట్టింది. సింహంతో ఉన్న సదరు కపుల్ ఫొటోలను లాహోర్ ఫొటోగ్రఫీ స్టూడియో (Afzl) ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేయగా, సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫొటోషూట్ కోసం సింహానికి మత్తుమందు ఇచ్చి ప్రాపర్టీగా వాడటం సరికాదని, సదరు ఫొటో స్టూడియోపై లీగర్ యాక్షన్ తీసుకోవాలని పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
@PunjabWildlife does your permit allow for a lion cub to be rented out for ceremonies?Look at this poor cub sedated and being used as a prop.This studio is in Lahore where this cub is being kept.Rescue him please pic.twitter.com/fMcqZnoRMd
— save the wild (@wildpakistan) March 7, 2021
ఈ వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం సింహం కూనకు మత్తుమందు ఇచ్చి వధూవరుల మధ్య కూర్చోబెట్టారు. సింహం పడుకొని ఉండగా, ఫొటోగ్రాఫర్స్ స్టిల్ ఫొటోలు తీసుకున్నారు. ఇక మరో ఫొటోలో జంటకు కొద్ది దూరంలోనే సింహం ఉంది. కాగా ఈ ఫొటో షూట్ తర్వాత #SherdiRani హ్యాష్ ట్యాగ్‌తో సదరు ఫొటో స్టూడియో ఇన్‌స్టా స్టోరీగా ఈ వీడియోను షేర్ చేయగా.. జేఎఫ్‌కే యానిమల్ రెస్క్యు అండ్ షెల్టర్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వన్యప్రాణులను రక్షించాలని (Save the Wild) కోరుతూ ‘పంజాబ్ వైల్డ్ లైఫ్ అండ్ పార్క్స్’ డిపార్ట్‌మెంట్‌ను కోరారు. వెంటనే ఆ సింహం కూనను అక్కడ నుంచి తీసుకొచ్చి పార్కులో ఉంచాలని డిమాండ్ చేశారు. కాగా పబ్లిక్ అట్రాక్షన్, అటెన్షన్ డ్రా చేయడం కోసం చేసే ఇలాంటి ఫొటో షూట్ల కోసం సింహం కూనను ఎలా ఇచ్చారు? అని నెటిజన్లు ఆఫీసర్లను ప్రశ్నిస్తున్నారు. సెర్మనీల కోసం సింహాలను వాడుకోవచ్చా? అని అడుగుతున్నారు. జంతువుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.