- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం రూ.2వేల కోట్లు గోల్‌మాల్?
దిశ, ఏపీ బ్యూరో: ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫైబర్‌గ్రిడ్ టెండర్లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ విచారణలో భాగంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం గుట్టురట్టు చేసింది. సుమారు రూ.2వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అంచనా వేస్తోంది. బ్లాక్ లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించిందని.. ఫోర్జరీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి 19 మందిపై సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీని శనివారం న్యాయస్థానానికి సీఐడీ అందజేసింది. ఇకపోతే గత ప్రభుత్వం టెరా సాఫ్ట్‌కు అడ్డగోలుగా ఫైబర్ గ్రిడ్ టెండర్లు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఫైబర్ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం
నాలుగేళ్ల బాలుడు మృతి
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని వైఎస్ నగర్‌లో విషాదం అలముకుంది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ లైన్ కోసం తీసిన కుంటలో పడి జంగాలకాలనికి చెందిన నాలుగవ తరగతి విద్యార్థి మల్లికార్జున మృతి చెందాడు. ఏపీ ఫైబర్ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మల్లికార్జున ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. డోన్ పట్టణంలోని వైయస్ నగర్‌లో గత కొన్ని రోజులుగా భూమిలో కేబుల్ వైర్ ఉంచే క్రమంలో గుంత తీసి వదిలి వేశారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీరు నిల్వ ఉండడంతో సరదాగా ఈతకు వెళ్లిన మల్లికార్జున అందులో దిగడంతో ఊపిరాడక మృతి చెందాడు. బాలుడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో మల్లికార్జున మృతి చెందాడు.