పోలవరంలో అవినీతి జరిగింది -ఎమ్మెల్సీ మాధవ్

by Anukaran |
పోలవరంలో అవినీతి జరిగింది -ఎమ్మెల్సీ మాధవ్
X

దిశ, వెబ్ డెస్క్: విజయదశమి సందర్భంగా బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. పోలవరం అంచనాల పెంపుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వాస్తవ అంచనాలకు అనుగుణంగానే కేంద్రం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు.

సాంకేతికత పేరుతో ప్రాజెక్టు అంచనాలను పెంచేశారన్న మాధవ్.. అంచనాల పెంపుపై విచారణ జరగాలన్న విషయాన్ని గతంలో కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. విశాఖలో గీతం యూనివర్సిటీలో అక్రమ కట్టడాల పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై మాధవ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడినట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు.

Advertisement

Next Story