హరీష్ రావు ఇలాకాలో సర్పంచ్ సస్పెండ్.. ఎందుకంటే?

by Sumithra |
Pullur Grama Panchayat
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట రూరల్ మండలం పుల్లూర్ గ్రామ సర్పంచ్‌పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. రూ. లక్షా 35 వేల వంద రూపాయల గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడని గ్రామస్తులు ఇటీవల అధికారులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు గ్రామంలో విచారణ ప్రారంభించారు. విచారణ నిధుల దుర్వినియోగం చేసింది నిజమే అని తేలడంతో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సర్పంచ్‌ నరేష్‌పై మూడు నెలలపాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మూడు నెలలు ఉప సర్సంచ్ ప్రసాద్ రెడ్డికి సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు. కాగా, గతంలో కూడా హరితహారం మొక్కలు తొలగించాడని అధికారులు సర్పంచ్ నరేష్‌‌కు ఫారెస్ట్ అధికారులు పెనాల్టీ విధించారు. అయితే.. సాక్షాత్తు.. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో సర్పంచ్ అవినీతి ఆరోపణలపై అధికారులు సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed