ఈటల విజయం కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు..

by Shyam |   ( Updated:2021-11-03 05:54:14.0  )
ఈటల విజయం కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు..
X

దిశ , రాజేంద్రనగర్ : హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ప్రజలు మాత్రం ఈటల రాజేందర్ ను గెలిపించడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని, మైలార్ దేవుపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్పడుతున్న అవినీతిపై ప్రశ్నించినందుకే పార్టీ నుండి బహిష్కరించారన్నారు. కానీ హుజురాబాద్ ప్రజలు మాత్రం ఆయన వెన్నంటే ఉండి ఉప ఎన్నికల్లో గెలిపించారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సైతం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

డివిజన్ అభివృద్ధికి నిధులివ్వండి..
గ్రేటర్ ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నా.. నిధుల కొరతతో సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కార్పొరేటర్ తోకల ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ ఎంసీ కి నిధులు కేటాయించి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed