కరోనా రెట్టింపు: ఒక్కరోజే ముగ్గురు మృతి

by Shamantha N |
కరోనా రెట్టింపు: ఒక్కరోజే ముగ్గురు మృతి
X

న్యూఢిల్లీ : ఆదివారం ఒక్కరోజే కరోనా బాధితులు ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. దేశంలోకి వైరస్ ప్రవేశించినప్పటి నుంచి నిన్నటి వరకు కేవలం నాలుగు మరణాలే నమోదయ్యాయి. కానీ, ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మరణించడం గమనార్హం. మహరాష్ట్ర, బీహార్, గుజరాత్‌లలో ఒక్కొక్కరి చొప్పున కరోనా బాధితులు మరణించారు. అలాగే, కరోనావైరస్ కొత్తగా నమోదైన కేసులూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. గురువారం రాత్రి వరకు దేశంలో నమోదైన కరోనా కేసులు 176గా ఉన్నాయి. కానీ, శుక్ర, శని, ఆదివారం సాయంత్రానికి ఈ సంఖ్య రెట్టింపునకు పైగా నమోదయ్యాయి. మొదటి నుంచీ గురువారం వరకు 176గా నమోదవగా.. కేవలం మూడు రోజుల్లోనే 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రానికి కరోనా కేసులు 370కి చేరాయి.

Tags: coronavirus, spread, death toll, fresh cases, mount, count


👉 Read Disha Special stories


Next Story

Most Viewed