- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరకాటంలో మైక్రోఫైనాన్స్!
దిశ, వెబ్‌డెస్క్: గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో అన్ని రకాల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని సూక్ష్మ రుణ సంస్థలు(ఎమ్ఎఫ్ఐ) రానున్న కాలంలో తీవ్ర నష్టాలను చూడక తప్పదు. ఈ రంగం వృద్ధిపై మరింత ఆందోళన తప్పేలా లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్-19 ప్రభావం తగ్గిపోయి లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రస్తుతం నష్టాలను అధిగమించేందుకు అవసరమైన చర్యలపైనే దృష్టి సారించాల్సి ఉంటుందని ఎమ్ఎఫ్ఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణంగా ఏటికేడు పలు సంస్థలు విస్తరణ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంటాయి, ఈ పరిణామాలతో తాత్కాలికంగా వాటన్నిటినీ నిలిపేయాల్సి వస్తోందని మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ నెట్‌వర్క్ ఛైర్‌పర్సన్ తెలిపారు.
లాక్‌డౌన్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందనే దానిపైనే ఎమ్ఎఫ్ఐల భవితవ్యం ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్‌లలో లాక్‌డౌన్ ప్రభావం అధికంగా ఉన్నందున రానున్న త్రైమాసికంలో వీటి ప్రభావ ఫలితాలు తెలుస్తాయి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియం కారణంగా ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన వసూళ్లు క్షీణించడం ఖాయం. ఆన్‌లైన్ లావాదేవీల కారణంగా పూర్తీస్థాయి నష్టం లేకపోయినప్పటికీ సంస్థలు వాటి ప్రభావం నుంచి తప్పించుకోలేవని తెలిపారు.
వ్యవసాయేతర రంగాలు సాధారణ స్థితికి రావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం పరిశ్రమల వృద్ధి 15 శాతానికి పడిపోయే అవకాశముందని అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ వర్గాలు చెబుతున్నాయి.
కోవిడ్-19 సంక్షోభం వల్ల ఆర్థిక వృద్ధి ప్రతికూలంగా మారుతుందనే భయాలు ఈ రంగంలోని వారికి ఉంటుంది. సంబంధిత పరిశ్రమలు లాక్‌డౌన్ తర్వాత తమ సిబ్బందిని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పునరుద్ధరణ కార్యకలాపాలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా పరిశ్రమలు ఖచ్చితంగా విస్తరణ అనే అంశాన్ని పూర్తీగా పక్కనపెడతాయి. ప్రస్తుతం వారికి కావాల్సింది నిలదొక్కుకోవడం. కాబట్టి కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా తమకు కష్టాలు, నష్టాలు తప్పవని అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ వర్గాలు భావిస్తున్నాయి.
లాక్‌డౌన్ వల్ల ఎమ్ఎఫ్ఐల కార్యకలాపాలు ఆగిపోయాయి. అన్ని శాఖలు మూసివేయబడ్డాయి. ఫీల్ పనులు జరగడం లేదు. సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. వినియోగదారులతో సాధ్యమైనంతగా ఫోన్‌ల ద్వారానే సందేహాలను తీరుస్తున్నారు. కొన్ని సంస్థలు ఆన్‌లైన్ కార్యకలాపాలు జరుపుతున్నాయని, అయితే, ఇవి మొత్తం వ్యాపారంలో 10 శాతం కూడా లేవని అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ చెబుతోంది.
Tags: Lockdown, Coronavirus, COVID19, MFI