ఊపిరితిత్తులపై కరోనా కత్తులు

by  |
ఊపిరితిత్తులపై కరోనా కత్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు నేటికీ వణుకుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉన్నది. దీంతో ప్రజలతోపాటు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. కాగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. అయితే ఈ వైరస్ సోకిన వారు చికిత్స పొందినా వారిలో పూర్తిగా కొవిడ్-19 లక్షణాలు తగ్గడం లేదని, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

కొవిడ్-19 నుంచి కోలుకున్న పేషెంట్లతో ఊపిరితిత్తులతోపాటు ఇతర అవయవాలు దెబ్బతింటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. చైనాలోని వుహాన్‌కు చెందిన జాంగ్‌హాన్ హాస్పిటల్ నిపుణుల బృందం చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆ బృందం నివేదిక ప్రకారం.. కరోనా బాధితుల్లో 90 శాతం మంది లంగ్స్ సమస్యను ఎదర్కొన్నారని, వారిలో 5 శాతం మంది తిరిగి క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడైంది.

ఆరోగ్యవంతులతో పోల్చితే కరోనా నుంచి కోలుకున్న వారి ఊపిరితిత్తులు సరిగా పని చేయడం లేదని తేలింది. వారి ఊపిరితిత్తుల్లో వాయు ప్రసరణ, గ్యాస్‌ ఎక్స్ఛేంజ్‌ విధులు సక్రమంగా జరగడంలేదని గుర్తించారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో బి-కణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని, వారిలో రోగ నిరోధక వ్యవస్థ వృద్ధి చెందలేదని వెల్లడించారు. చికిత్స పొందిన కొంతమందిలో 3 నెలల పాటు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. పూర్తిగా కోలుకున్న 10 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు కనుమరుగైపోయాయని ఆ వైద్యం బృందం పేర్కొంది.


Next Story

Most Viewed