తెలంగాణలో కరోనా కలకలం

by Shyam |   ( Updated:2021-04-23 23:15:45.0  )
తెలంగాణలో కరోనా కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కొరలు చాస్తోంది. వేల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంట్లలో రాష్ట్ర వ్యాప్తంగా 7,432 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇదే సమయంలో మరో 33 మంది కరోనాతో కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,87,106కు చేరగా.. మృతుల సంఖ్య 1961కి పెరిగింది. ఇక వైరస్ నుంచి కోలుకొని తాజాగా 2157 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు వైరస్ నుంచి 3,26,997 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 58,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1464, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 606, రంగారెడ్డిలో 504, నిర్మల్‌లో 486 కేసులు నమోదు కావడం గమనార్హం.

Advertisement

Next Story