వైసీపీ ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా!

by srinivas |
వైసీపీ ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా!
X

దిశ, కర్నూలు: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 1100కు చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇప్పటివరకూ ఏపీలో 81 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1097కి చేరింది. కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 279 కేసులు నమోదయ్యాయి. తాజాగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు వైసీపీ పార్లమెంటు సభ్యులు సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే మీడియాకు చెప్పారు.

వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్‌తో పాటు ఆయన సోదరులు, వారి సతీమణులు, వీరిలో ఒకరి కుమారుడి(14)కి కూడా కరోనా సోకినట్లు, అలాగే ఎంపీ సంజీవ్ తండ్రి(83)కి కూడా కరోనా సోకిందని నిర్ధారణ అయింది. ఎంపీ తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే..ఎంపీ ఇంట్లో కరోనా సోకిన ఆరుగురిలో నలుగురు వైద్యులు కావడం. మీడియాలో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాతే ఎంపీ స్వయంగా బయటపెట్టడం విశేషం.

Tags: corona attacked for ycp mp family, ycp mp, ysrcp kurnool mp

Advertisement

Next Story

Most Viewed