మృతిచెందిన చిన్నారికి కరోనా

by vinod kumar |   ( Updated:2020-05-29 08:47:34.0  )
మృతిచెందిన చిన్నారికి కరోనా
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రానికి చెందిన ఓ ఏడు నెలల ఓ చిన్నారి గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉంది. ఈ క్రమంలో ఈ నెల 27న తీవ్రమైన జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. రాత్రికి హత్నూరలో చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఆసుపత్రిలో చిన్నారికి మృతదేహానికి కరోనా టెస్ట్ చేయగా.. గురువారం రాత్రి ఫలితాల్లో పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో చిన్నారి అంత్యక్రియల్లో పాల్గొన్న 150 మందిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు అధికారులు.

Advertisement

Next Story

Most Viewed