పెళ్లి కూతురుకు కరోనా.. వివాహం వాయిదా

by Anukaran |   ( Updated:2020-07-25 22:21:55.0  )
పెళ్లి కూతురుకు కరోనా.. వివాహం వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కాకవికలం చేస్తోంది. తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఆఖరికి పెళ్లి చేసుకుంటున్న నూతన వధూవరులను కూడా కరోనా వదలడంలేదు. దీంతో ఆ వివాహ కార్యక్రమాలు వాయిదా లేదా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో ఓ వివాహ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కూతురుకు కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో ఆ పెళ్లి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. పెళ్లి రేపు జరగాల్సి ఉంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తేలింది. ఈ కారణంగా పెళ్లి కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed