వూహాన్‌లో మళ్లీ కరోనా కేసులు

by vinod kumar |   ( Updated:2020-05-11 07:51:13.0  )
వూహాన్‌లో మళ్లీ కరోనా కేసులు
X

వుహాన్: కరోనా వైరస్ పుట్టిందని భావిస్తున్న వూహాన్‌లో చైనా ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా అక్కడ వైరస్ జాడలేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితమే వూహాన్ ప్రజలు సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించారు. కాగా, తాజాగా వూహాన్‌లో కరోనా తిరిగి కలకలకం సృష్టిస్తోంది. ఆ నగరంలోని ఒక క్లాంప్లెక్స్‌లో ఉంటున్న ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. వూహాన్‌లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో ఇటీవలే లాక్‌డౌన్ ఎత్తేశారు. దీంతో కార్యాలయాలు, విద్యాసంస్థలు, థియేటర్లు, మ్యూజియమ్స్, అమ్యూజ్‌మెంట్ సెంటర్లు తెరుచుకున్నాయి. నగరంలోని పలు వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఐదు కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా బారిన పడిన ఐదుగురిలో కూడా ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవడం గమనార్హం. వీరిలో 89 ఏండ్ల వృద్దురాలు కూడా ఉంది. ఆమె భర్త కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed