- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయ్..నిన్నే!
చూశ్నవా మామా..జిందగీ ఎంత బర్డెన్ అవుతున్నదో!
కైకూ? గిపుడీ వేదాంతం
వేదాంతం కాదు, వాస్తవం, రియల్
ఏంటీ బ్రో డల్ స్పీచ్
ఎహే డల్ కాదు, నవ్వాలో, ఏడ్వాలో..డైలమా!
ఇప్పటికిపుడే ప్లేటు ఫిరాయించావేందీ కాకా
ప్లేటూ కాదు, గ్లాసూ లేదు. ఏది ముట్టినా, ఏది తాకినా..గడప దాటితే..డౌట్లే డౌట్లు
ఏంది? కరోనా గురించేనా
యస్..కొవిడ్-19 బాతే
టెన్షన్ ఎందుకు? సీరియస్‌గా కొన్ని ప్రికాషన్స్ కంపల్సరీ గంతే
గదే నేననేదీ భయ్యా. మనం ఫుల్లు ఖైరత్ (అలర్ట్)గనే ఉంటం.
ఎదుటోళ్ల సంగతి పైనే ఫికరంతా
ఎవరికి వారు కేర్‌ఫుల్‌గా ఫాలో గావాలే.
సిటీల ఇంకో ఇద్దరికి కరోనా పాజిటీవటా!
హైదరాబాద్ అంటేనే భయమయ్యేట్టుగా!
ఆడా ఈడా అని కాదు, అంటినోళ్లు యాడ తిరిగితే ఆడికొస్తది.
రాకపోయేందుకు అదేం సువర్ణ(గోల్డ్) కాదు, వైరస్సు.
మరేం జేసుడు బాబాయ్.
మళ్లా మొదటికొచ్చినవ్‌లే! జెస్ట్ మన జాగ్రత్తల మనముండాలే.
ప్రాక్టికల్‌గా వీలైతదా?
ఎందుగ్గాదూ?
మాస్క్ కట్టుకోవాలే. దొరక్కపోతే, చలిల కట్టుకున్నట్టుగ ఫ్రెష్ క్లాత్ సుట్టుకోవాలే.
చేతులకు గ్లౌసెస్ వేసుకోవాలే.
గిదే గిసొంటియి ఎన్నని వీలైతయనీ..
ప్రతి దాంట్ల అట్ల అనుకుంటే ఎట్ల?
కొన్ని దినాలు తిప్పల వడాలే తమ్మీ.
చూడు సిస్టర్!
వింటున్న, వింటున్న.
ఇంట్ల మా మమ్మీ, డాడీ, బ్రదరూ అందరూ సజెషన్సు ఫాలో అయితున్నరు.
ఇదిగో..నేను కూడా.
ఏవేవో రకరకాల గైడ్‌లైన్సు రిలీజ్ చేస్తున్నరు
యస్..బ్రో. రిపీటెడ్‌గా హాండ్స్ లిక్విడ్‌తో వాష్ చేసుకోవాలే.
షేక్ హాండ్‌కు బదులు చేతులు జోడించాలే..
చల్లటి ఫుడ్ తినొద్దు, గోరు వెచ్చటి వాటర్ తాగాలే.
క్రౌడ్ ఏరియాల్లోకి వెళ్లొద్దు. బస్సులు ఎట్సెట్రాల్లోనైతే, చెప్పాను కదా మాస్కులు యూజ్ చేయాలే.
ఏం జేద్దాం! ఇవన్నీ పాటించాలే.
టోటల్ వరల్డే షేక్ గావట్టే.
ఆఫ్టరాల్ దగ్గూ, తుమ్మూ ఎంతలా గజగజలాడిస్తున్నయో!
తుమ్మిన ప్రతి ఒక్కరు కాదు కాకా..పర్టిక్యులర్ కేసుల్లోనే
అన్నీ ఈజీ అయ్యాయి కానీ, లైఫే ఇట్లా..!
అదిగో, మళ్లీ అక్కడికే వచ్చావ్.
వెనుకటి రోజుల్లోనూ ప్లేగు వ్యాధి, గత్తర రోగం, వంటివి ఉండేవి, ఊళ్లకు ఊళ్లే శ్మశానాలు అయ్యేవీ!
కావాలంటే, మీ బామ్మను కనుక్కో!
అది సరే, ఇంత టెక్నాలజీ, తెలివి తేటలు ఉండి కూడా..?
బొమ్మా, బొరుసులా మంచీ చెడూ ఉంటాయి తమ్ముడూ!
కొత్తగా చుట్టుకుంటున్న చాలెంజ్‌లను మనం ఎదుర్కోవాల్సిందే.
అపాయాల విరుగుడుకు అద్భుతాలపై రిసెర్చులు జరుగుతూనే ఉంటాయి.
చైనాను చూడు, డేంజరెస్ క్రైసిస్‌ను ఎట్లా డేర్‌గా డీల్ చేస్తున్నదో!
ఆ..చేస్తున్నది, చేస్తున్నదిలే!
పురుగూ పుట్రా తిన్నాక కరోనా కాకుండా, కత్రినా కైఫ్ వస్తదా!
దేఖో, ఫిర్ బీ నీ కుళ్లు జోకులు!
తిండి వల్ల కాదట, అదేదో చేయబోతే..అదే ఇట్లా వైరసై వాటేసుకున్నదట.
ఆ..ఆ..అదేంటో ఇంకా ఫైనల్ కాలేదులే. అవన్నీ రకరకాల గెస్సులే.
చైనానే కాదు, ఇటలీ, సౌత్ కొరియా, అమెరికా, జపాన్..ఫిఫ్టీ కంట్రీస్ సఫర్ అవుతున్నాయనుకో!
అగో, ఇండియా? అవును బాబూ, అవును మన ఇండియా, మన హైదరాబాద్ కూడా. సరేనా!
ఇంతకీ ఏట్ల మరి?
ఎట్లేందీ? వింటున్నవీ, చూస్తున్నవీ మైండ్ల రిజిస్టర్ చేసుకోవాలే.
వాటిని ఓ డ్యూటీలా అనుసరించాలే.
ఎట్లాగూ ఈ మార్చి ఆఖరుకల్లా ఎండలు దంచుతై. ఆ వైరస్ పరార్ అయితది!
గ్యారెంటీయా దోస్త్!
అరే ఓ మేరీ జిగ్రీ ఫ్రెండ్..డోంట్ వర్రీ.
వైరస్ పాజిటివ్‌లు పెరగొద్దనుకుంటే, మనం జీవితం పట్ల పాజిటివ్‌గా ఉండాలే.
చెప్పావులే నీతులు. ఇంకా చెప్పు!
హబ్బా, నీతో వేగెదెట్టబ్బా?
మనమూ, మన సొసైటీ ఎన్ని టాస్క్‌లను గెటాన్ కాలేదూ! హిస్టరీ తిరగెయ్, సమజైతది!
ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, ఎ టూ జెడ్ ప్రికాషన్స్ తీసుకుందాం.
ముందున్నవన్నీ మన రోజులే, మంచి రోజులే, సరేనా!
అన్నట్టూ! గౌరవ సార్/మేడం, అక్కా/చెల్లె, అన్నా/తమ్మీ, తాతా/బామ్మా..
కాస్త ఈ ఫైల్‌తో స్టే విత్ అజ్ అవ్వాలనే..‘ఓయ్..నిన్నే’ హెడ్డింగ్ పెట్టాం.
మరోలా అనుకోకండే..ప్లీజూ!
Tags : corona, public talk, hyderabad