- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా నివారణ చర్యలు భేష్’
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా విస్తృతి నేపథ్యంలో మరికొన్ని వారాలు లాక్‌డౌన్ కొనసాగుతుందన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కీలక సమయంలో అధికారులపై రాజకీయ నేతల ఒత్తిడి తగదని, అధికారులకు సహకరించమని టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను కోరుతున్నానన్నారు. అనుమనితులను క్వారంటైన్‌కు తరలించేందుకు సహకరించాలని అన్నారు. తెలంగాణలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ కంటే మన దగ్గరే కేసులు ఎక్కువగా నమోదవుతుండటం అందోళన కలిగించే అంశం, కరోనా కట్టడి విషయంలో అధికారులకు స్వతంత్రత ఇవ్వాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా నివారణ చర్యలు భేష్ అని, రైతులకు గన్ని బ్యాగ్‌లు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రైతుల విషయంలో ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు.
Tags: Coronavirus, prevention, BJP-ruled states, nizamabad, mp arvind