- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిల్ రాజుకు కరోనా.. టెన్షల్‌లో చిరంజీవి, పవన్ ఫ్యాన్స్
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే, టాలీవుడ్‌కు చెందిన హీరోలు, ప్రముఖులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లోని వెళ్లారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని దిల్ రాజ్ కోరారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ అయిన తర్వాత దిల్ రాజు థియేటర్ల ఆడియన్స్‌తో కలిసి సినిమా చూశారు. మూవీ ప్రచారాల్లో పాల్గొన్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు రోజుల కిందే వకీల్ సాబ్ సక్సెస్ సందర్భంగా దిల్ రాజు, శ్రీరామ్ వేణులను సత్కరించాడు. దాంతో ఇప్పుడు ఆయనకు కూడా కంగారు మొదలైంది. పవన్ అభిమానుల్లో కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇప్పటికే వకీల్ సాబ్ యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే.
Corona positive for producer