స్కూళ్లల్లో కరోనా కలకలం.. గురుకులంలో ఏడుగురు విద్యార్థినిలకు కరోనా

by Shyam |   ( Updated:2021-12-03 01:35:41.0  )
స్కూళ్లల్లో కరోనా కలకలం.. గురుకులంలో ఏడుగురు విద్యార్థినిలకు కరోనా
X

దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థినిలు కరోనా బారిన పడినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. 631 మంది విద్యార్థుల గల పాఠశాలలో ప్రస్తుతం 583 మంది విద్యార్థులు ఉన్నారు. ఇటీవలే ఇంటి నుండి వచ్చిన ఒక విద్యార్థిని అనారోగ్యానికి గురవ్వడంతో పాఠశాల ప్రిన్సిపల్ కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, వెంటనే అప్రమత్తమై జిల్లా అదనపు కలెక్టర్, DOకి సమాచారం అందించగా స్పందించి వెంటనే జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా పాఠశాలలో క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్ష చేయగా డిసెంబర్ 1వతేదీన నలుగురు, డిసెంబర్ 2న మరో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మొత్తం ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా గుర్తించినట్లు తెలిపారు.

తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు-ప్రిన్సిపాల్

పాఠశాలలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ఐసోలేషన్ రూమ్ తో పాటు ప్రతిరోజు అన్ని క్లాస్ రూమ్ లు, టాయిలెట్ లు,పాఠశాల ఆవరణలో శానిటేషన్ చేస్తున్నామన్నారు. వైరస్ బారిన పడిన అమ్మాయిలతో పాటు మిగతా విద్యార్థులకు కూడా టెస్టులు చేయించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలిపారు. తల్లిదండ్రులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, క్లాసులు యధావిధిగా నడుస్తాయని ప్రిన్సిపాల్ తెలిపారు.

Advertisement

Next Story