- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే ఉద్యోగులను వదలని కరోనా.. రోజుకు 150మందికి పాజిటివ్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఉద్యోగులు కరోనా బారిన పడి మరణించారు. కాగా భారతీయ రైల్వేలో ఇప్పటి వరకు 2,400 మంది కరోనా కాటుకు బలయ్యారని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలో రోజుకు 150 మంది ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులను ప్రాధాన్య జాబితాలో చేర్చి అందరికి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు ఆయన తెలిపారు. ఇప్పటికి రైల్వేలో 12 లక్షల మంది సిబ్బందిలో 7.50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కరోనా ఆంక్షల వల్ల రైళ్లను పూర్తిస్థాయిలో నడపలేకపోతున్నామని , ప్రస్తుతం దేశవ్యాప్తంగా 889 ప్రత్యేక రైళ్లు, 479 ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్టు సునీత్ శర్మ తెలిపారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైల్వే ఆసుపత్రులలో వెంటిలేటర్లు, పడకలు పెంచడంతోపాటు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా నెలకొల్పినట్టు ఆయన వివరించారు.