- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా విలయతాండవం.. 1259 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతూ ఆంధ్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ప్రభుత్వం కరోనా కంట్రోల్‌లో ఉందని చెబుతోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదై ప్రభుత్వ, వైద్య ఆరోగ్య, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 40 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. గుంటూరు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. కడపలో 7, నెల్లూరులో 3, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చెరొక్క కేసు నమోదైనట్టు తెలిపింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 1259 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రకటించింది.
ఇందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 332 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో 280 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 43 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ఏపీలో కరోనా కారణంగా అత్యధికంగా మృతి చెందిన వారు ఈ జిల్లా నుంచేనని చెప్పింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారని తెలిపింది.
ఆ తరువాతి స్థానంలో గుంటూరు జిల్లా నిలిచినట్టు వెల్లడించింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 254 మంది కరోనా బారిన పడగా, వారిలో 207 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. 39 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరారని తెలిపింది. మరో 8 మంది కరోనా కారణంగా మృతి చెందారని ప్రకటించింది.
223 పాజిటివ్ కేసులతో కృష్ణా జిల్లా మూడో స్థానంలో నిలిచింది. 186 మంది చికిత్స పొందుతుండగా, 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో కరోనా నెమ్మదించింది. దీంతో ఆ జిల్లాలో 82 మంది కరోనా బారిన పడగా, 56 మంది చికిత్స పొందుతున్నారు. 24 మంది కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో 74, కడప జిల్లాలో 65, ప్రకాశం జిల్లాలో 56, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెరి 54 చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 39, విశాఖపట్టణం జిల్లాలో 22, శ్రీకాకుళం జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 80,334 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 79,075 మందికి నెగిటివ్ వచ్చిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 1259 పాజిటివ్ కేసులు నమోదైతే.. 970 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 258 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది మృత్యువాత పడ్డారు.
Tags: coronavirus, covid-19, andhra pradesh, health department