- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో 3,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినుంచి 1198 మంది కోలుకోగా.. మహమ్మారి మూలంగా మరో 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,41,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,09,594 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 1198 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 20,215 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీలో అత్యధికంగా 505 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉందని.. ప్రజలంతా మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.