కరోనా రోగి బలాదూర్.. భయపడుతున్న జనాలు

by Aamani |   ( Updated:2021-04-08 06:58:21.0  )
కరోనా రోగి బలాదూర్.. భయపడుతున్న జనాలు
X

దిశ, బోథ్ : ఇప్పుడు అందరి గుండెలో కరోనా సెకండ్ వేవ్ గుబులు రేపుతోంది. ఎవరి భయంలో వారు ఉంటే కరోనా సోకిన పలువురు వ్యక్తులు యథేచ్చంగా బయట తిరుగుతూ స్థానికులకు బయపెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భోథ్ మండల కేంద్రంలో ఈ ఘటన వెలుగుచూసింది. కరోనా సోకిన వ్యక్తి తన హోం ఐసోలేషన్ ముగియకముందే వచ్చి టీ స్టాల్లో టీ తాగుతున్నాడని స్థానికులు వాపోయారు. ఇంకో వ్యక్తి ఏకంగా భోథ్ బస్టాండ్‌లో బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా తెలిసిన వ్యక్తులు వచ్చి దూరం నుంచి బస్సును ఎక్కకుండా అడ్డుకున్నారు. ఇప్పటికైనా కరోనా సోకిన వ్యక్తి పై అధికారులు దృష్టి ఉంచాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఒకవేళ లేకుంటే వారి ద్వారా కేసులు మరింత పెరిగే అస్కారం ఉందని ఇప్పటికైనా వారి బయట తిరగకుండా జాగ్రత్త పరచాలని తెలియజేసుకుంటున్నారు. కరోనా రోగి బయట తిరుగుతున్నారని మాకు ఏలాంటి సమచారం రాలేదని, ఎవరైనా సమచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు సమాధానం ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed