- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్..

దిశ, రంగారెడ్డి బ్యూరో : ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంఘటనలు సంభవించినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు చెపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులు ప్రదర్శనలు చేశారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ఆవరణలో ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిసాజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్) టీం వారు చేపట్టే సహాయక చర్యలు, ప్రమాదాల నుండి ప్రజలను ఏ విధంగా రక్షించడం జరుగుతుందనే అంశములపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
భవనాలు కూలిపోయినప్పుడు, కొండచరియాలు విరిగిపడినప్పుడు, వినాశకరమైన వరదలు సంభవించినప్పుడు, తుఫానులు వంటి అనేక విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ టీం అద్బుతమైన పని తీరుతో ప్రజలను రక్షిస్తారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తమను తాము ఏ విధంగా రక్షించుకొని ప్రమాదాల నుండి బయటపడవచ్చునో వివరిస్తూ కలెక్టరేట్ అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు, కలెక్టరేట్ ఏఓ సునీల్, కలెక్టర్ సీసీ జనార్దన్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి గంప శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.