సూర్యాపేటలో మరో ముగ్గురికి కరో

by Sridhar Babu |   ( Updated:2022-08-31 14:28:29.0  )
సూర్యాపేటలో మరో ముగ్గురికి కరో
X

దిశ, నల్లగొండ:
సూర్యాపేట జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. జిల్లా కేంద్రంలోని కొత్త గూడెంబజార్‌లో పాజిటివ్ నమోదైన వ్యక్తి భార్యకు, నెరేడుచర్లలో ఒకటి, తిరుమలగిరిలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ జరిగినట్టు వెల్లడించారు. ఇవన్నీ ఢిల్లీ మర్కజ్ వెళ్ళి వచ్చిన వ్యక్తి ద్వారా సోకినవే అని తెలిపారు. మూడు రోజుల కింద 47 మంది రక్త శాంపిల్స్ పంపించగా అందులో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ జరిగినట్టు ప్రకటించారు. మరో 137 మంది అనుమానితులు రిపోర్టులు రావలసి ఉన్నది.

Tags: Corona, positive, three others, Suryapet, delhi murkaj, nalgoda

Advertisement

Next Story