కరోనా సోకిందని.. వృద్ధుడు ఆత్మహత్య

by Shyam |   ( Updated:2020-08-12 06:45:16.0  )
కరోనా సోకిందని.. వృద్ధుడు ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్ రూరల్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం, వైద్యాధికారులు చేపడుతున్న చర్యలు ఏమాత్రం బాధితుల గుండెల్లో ధైర్యాన్ని నింపడం లేదు. దీనికి నిదర్శనమే బుధవారం సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామ ఘటన. బుధవారం గ్రామంలో ఓ వృద్దుడు కరోనా సోకిందని ఆత్మహత్య చేసుకున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..

మృతిచెందిన వృద్ధుడు ఐదురోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కుటుంబ సభ్యుల అందరికీ కరోనా సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వృద్ధుడు, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వృద్ధులతో పాటు అతని భార్య, మిగతా ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందని సీఐ ప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story