బాసర ఆలయంలో కరోనా కలకలం

by Aamani |
బాసర ఆలయంలో కరోనా కలకలం
X

దిశ, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. గతంలో బాసర ఐఐఐటీలో ఇద్దరికీ, స్థానిక బిసి వసతి గృహంలో ఒకరికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా బాసర ఆలయంలో ఓ పూజారికి బుధవారం పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఈ విషయం ఆలయ సిబ్బందిలో తీవ్ర అలజడి రేపుతుంది. ఇప్పటికే గ్రామస్తుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే వారసంతను కొన్ని రోజుల పాటు రద్దు చేశారు. కరోనా మహమ్మారి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బాసర.. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం దానితో పాటు ప్రస్తుతం మహారాష్ట్ర లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో సరిహద్దులలో అధికారుల ప్రత్యేక నిఘా అవసరం అన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో గల ధర్మాబాద్ నుండి ఆటోలతో పాటు ఇతర వాహనాల ద్వార బాసర, ముధోల్, భైంసా లకు రాకపోకలు రద్దు చేస్తే కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాసర ఆలయంలో పూజారి కి పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న సిబ్బంది, ఆలయం మొత్తం శానిటైజేషన్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed