‘కరోనా’ అంటే… ఎన్నో అర్థాలున్నాయ్ !

by Sujitha Rachapalli |
‘కరోనా’ అంటే… ఎన్నో అర్థాలున్నాయ్ !
X

దిశ వెబ్ డెస్క్: ‘కరోనా’, ‘కోవిడ్’.. ఈ రెండు పదాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. ఇటీవలే జన్మించిన కవలపిల్లలకు కరోనా, కోవిడ్ అనే పేర్లు పెట్టడం మనందరకీ తెలిసిన విషయమే. అంతేకాదు ‘కరౌనా’ పేరుతో ఓ ఊరు కూడా ఉంది. కానీ ఆ ఊరిని అందరూ ‘కరోనా’ అని అంటారు. తుర్మ్కెనిస్తాన్ ప్రభుత్వం అయితే.. ఏకంగా ‘కరోనా’ పదంపై నిషేధం విధించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంపిణీ చేస్తున్న ఆరోగ్య సమాచార బ్రోచర్ లో కూడా ఈ పదాన్ని ఉపయోగించకూడదని చెబుతోంది. ‘కరోనా’ అంటే ‘కిరీటం’అని అర్థం. అయితే ‘కరోనా’ అంటే అర్థాలు చాలానే ఉన్నాయి. ఓ సారి అవేంటో తెలుసుకుందాం.

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లో చూసినా… గూగుల్ లో ‘కరోనా’ మీనింగ్ ఏంటని సెర్చ్ చేసినా.. కరోనా అర్థం మనకు తెలుస్తుంది. అలానే కరోనా కు మరి కొన్ని అర్థాలున్నాయని తెలుస్తుంది. కరోనా అనే పదం ప్రాచీన గ్రీకు పదమైన ‘కొరోనె’నుంచి వచ్చింది.

ఆ వలయం:
సూర్య, చంద్రుల చుట్టూ అప్పుడప్పడూ ఓ వలయాకార కాంతి ఏర్పడుతుంది. దాదాపు అందరూ ఆ దృశ్యాన్ని చూసే ఉంటారు. అయితే ఆ వలయాకార కాంతినే ‘కరోనా’ అంటారు. అంతేకాదు సూర్య, చంద్ర గ్రహణ సమయంలోనూ ఏర్పడే కాంతి వలయాన్ని కూడా అదే పేరుతో పిలుస్తారు. నక్షత్రాలే మనకు మిణుకు మిణుకు మంటూ కనిపిస్తాయి. అయితే వాటి చుట్టూ కూడా ఇలాంటి కాంతి వలయాలు ఏర్పడుతాయి.

అనాటమీ ప్రకారం:
మానవ శరీరంలోని కొన్ని భాగాలకు కిరీటీలాంటి ఆకృతి ఉంటుంది. అలాంటి భాగాన్ని ‘కరోనా’ అంటారు. ఉదాహరణకు పంటి కొనభాగం కిరీటం లానే ఉంటుంది.

బయాలజీ బుక్కుల్లో:
మొక్కల్లో, జంతువుల్లో కిరీటం వంటి భాగాలు ఏవున్నా వాటిని ‘కరోనా’ అనే పిలుస్తారు. అంతేకాదు కొన్ని రకాలు పువ్వుల పై భాగం కూడా కిరటీ ఆకృతిని కలిగి ఉంటాయి. ఆ కిరీట భాగాన్ని కూడా ‘కరోనా’ అని పిలుస్తారు.

అలంకరణ:
చర్చిల్లో అమర్చే షాండిలియర్ ను కరోనా అనే అంటారు. అలానే షాండ్లియర్ లోని రౌండ్ పెండెంట్ లను కూడా ‘కరోనా’అని పిలుస్తారు.

ఫిజిక్స్:
కండక్టర్ చుట్టూ ఉంటే ‘కాంతిపుంజా’న్ని కూడా కరోనా అని పిలుస్తారు.

Tags: coronavirus, crown, meaning, light, sun, moon, flower,chandelier

Advertisement

Next Story