గద్వాల్‌లో మొబైల్ కరోనా ల్యాబ్

by Shyam |

దిశ, మహబూబ్‌నగర్: గద్వాల జిల్లాకు మొబైల్ కరోనా నిర్ధారణ ల్యాబ్ చేరుకుంది. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి మాట్లాడి మొబైల్ కరోనా నిర్ధారణ యంత్రాన్ని గద్వాలలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఈటల గద్వాల ఏరియా ఆస్పత్రికి మొబైల్ కరోనా నిర్ధారణ ల్యాబ్‌ను పంపించారు. ఇకపై నిర్ధారణ పరీక్షలు ఏరియా ఆస్పత్రిలోనే నిర్వహించనున్నారు.

tag: corona, diagnostic machine, Gadwal

Advertisement

Next Story