- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం లెక్కలు సరిచేసిన ఏపీ పోలీస్
ఆంధ్రప్రదేశ్ పోలీసులు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు తబ్లిగి జమాత్ మర్కస్ అంటే ఏంటో తెలియని వారికి కూడా తెలిసేలా చేసింది. ప్రతిభావంతులైన ఆంధ్రప్రదేశ్ పోలీసులే అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన మత కార్యక్రమంలో ఎంత మంది పాల్గొన్నారన్న పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద లేవన్నది అందరికీ తెలిసిందే.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో వారి ట్రావెల్ రికార్డులు పరిశీలించేపనిలో కేంద్రం ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలోని ఒక నియోజవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి బావమరిదికి కరోనా సోకింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అప్రమత్తమై వివరాలు కూపీలాగారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన మరో వ్యక్తి కూడా కరోనా మహమ్మారి బారిన పడినట్లు గుర్తించారు. దీంతో పాలనా యంత్రాంగాలు అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగాయి. కేంద్ర సంస్థలతో సమన్వయమై తబ్లిగ్ జమాత్ వివరాలు సేకరించాయి.
కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ కార్యక్రమంలో 9000 మంది పాల్గొన్నారని, వారందర్నీ క్వారంటైన్‌లో ఉంచామని ప్రకటించాయి. దీంతో అసలు ఆకార్యక్రమంలో పాల్గొంది 13,702 మందని ఏపీ పోలీసులు తెలిపారు. సెల్ టవర్ సిగ్నల్స్ విశ్లేషించిన పోలీసులు ఈ వివరాలు కేంద్ర వర్గాలతో పంచుకున్నాయి. దీంతో మిగిలిన వారికోసం గాలింపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరుకావడానికి తోడు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారందర్నీ గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది.
ఇక ప్రస్తుతం గుర్తించిన 13,702 మందిలో దాదాపు 7930 మందిపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిని అధికారులు తేల్చారు. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.
Tags: tabligi jamat markaz, delhi, ap, ap police, telephone signal analysis