ఢిల్లీని కమ్మేస్తున్న కరోనా..

by Shamantha N |
ఢిల్లీని కమ్మేస్తున్న కరోనా..
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి మరింత దిగజారుతోంది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం అంతగా కనిపించడం లేదు. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం కొత్తగా 1,299 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,41,531 చేరింది.

వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 15 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,059కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 1,27,124 మంది చికిత్స అనంతరం కోలుకున్నారని.. 10,348 మంది వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇవాళ 5,737 మందికి ఆర్టీపీసీఆర్/సీబీనాట్ / ట్రూనాట్ పరీక్షలు చేయగా, 14,699 మందికి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 11,20,318 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేజ్రీ ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.

Advertisement

Next Story