- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కేసులు తగ్గినా.. మళ్లీ పెరగవచ్చు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం 4 రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా కాని భవిష్యత్తులో పెరగవచ్చునని డీఎంఈ రమేష్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రోజుకు 550 టన్నుల ఆక్సిజన్ అందించేలా చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కొవిడ్ చికిత్సల కోసం హైదరాబాద్‌కు పేషెంట్లు వస్తుండటంతో భారీగా రెమిడిసివిర్ మందులను కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలిపారు.
శుక్రవారం ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించి మీడియా సమావేశంలో డీఎంఈ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో అదనంగా 160 ఐసీయూ బెడ్లను, టిమ్స్‌లో 300 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో 51 ఆక్సిజన్ జనరేటర్‌లను వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు మొత్తం 9,500 ఉండగా వీటి సంఖ్యను త్వరలోనే 15,000 వరకు పెంచుతామని చెప్పారు. నేటి నుంచి రాష్ట్రంలో రెండవ డోసు వారికి మాత్రమే వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటించారు.
11 లక్షల 250 మంది ఉండగా వీరిలో 31 వరకు 28 రోజులు పూర్తయ్యే వారు 4,09, 943 మంది ఉన్నారని చెప్పారు. వీరందరూ నేరుగా టీకా సెంటర్‌కు వెళితే వైద్య సిబ్బంది అక్కడిక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేసి వ్యాక్సిన్‌ను అందిస్తమని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదీనంలో కోవాక్సిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లు 3,74,900 డోసులు ఉన్నాయని ప్రకటించారు. 18 నుంచి 44 వయసు గల వారికి కూడా త్వరలోనే వ్యాక్సిన్‌ను అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,950 వైద్య బృందాలు 11లక్షల 223 ఇండ్లను సందర్శించారని చెప్పారు. కొవిడ్ లక్షణాలున్న 19 వేల మందికి కొవిడ్ మెడికల్ కిట్ ఏర్పాటును అందించామని తెలిపారు.
కొవిడ్ కిట్లను వ్యాధి లక్షణాలున్న వారు మాత్రమే వినియోగించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లను 14,032 ఏర్పాటు చేయగా వీటిలో 6,484 బెడ్లు ఖాళీగా ఉన్నయని ఐసీయూ బెడ్లను 11,194 ఏర్పాటు చేయగా వీటిలో 8271 బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇక నుంచి కేసులు, మృతుల సంఖ్యకు సంబంధించిన బెలిటెన్‌ను ఏరోజుకారోజు సాయంత్రానికి వెల్లడిస్తామని చెప్పారు.