ఏపీ స్కూళ్లలో కరోనా విజృంభణ

by srinivas |
ఏపీ స్కూళ్లలో కరోనా విజృంభణ
X

దిశ, వెబ్‎డెస్క్ :
ఏపీలో ఈ నెల 2 నుంచి పున: ప్రారంభమైన స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. ప్రకాశం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా పాఠశాలల్లో క్రమంగా విస్తరిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని గంగుల కుర్రు అగ్రహరం ప్రభుత్వ పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ స్కూలులో 117 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10 విద్యార్థులకు కరోనా సోకింది. ఈ కరోనా విద్యార్థులనే కాదు.. టీచర్లను వణికిస్తోంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 120 మంది టీచర్లకు కరోనా సోకగా.. నలుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. ఇక విశాఖ జిల్లా వ్యాప్తంగా 52 మందికి కరోనా పాజిటివ్ తేలింది. వారిలో 46 మంది టీచర్లు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. స్కూళ్లు పున:ప్రారంభం అయిన తర్వాత కరోనా విజృంభిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed