- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా@ 5854
దిశ, ఎంపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 13,923 శాంపిళ్లను పరీక్షించగా మరో 425 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 126 మందికి కరోనా సోకినట్టు తేలింది. అదే సమయంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 77 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 5,854 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు 2,779 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని 2,983 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో లో ఇప్పుడు వరకు మృతి చెందిన వారి సంఖ్య 92కి చేరింది.